AKP: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి ఆవరణలో ఈనెల 29న ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డీఎం అండ్ హెచ్వో డాక్టర్ హైమావతి శనివారం తెలిపారు. ‘స్వస్త్ నారీ స్వస్తక్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా ఎంపీ సీఎం రమేష్, కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.