NDL: శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో డ్యాం ఏడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న అధికారులు శుక్రవారం మధ్యాహ్నం మరొక గేటును ఎత్తివేశారు. తాజాగా డ్యామ్ 8 గేట్ల ద్వారా 2,15,424 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం, హంద్రీ ప్రాజెక్టుల ద్వారా 2,90,370 క్యూసెక్కుల వరద నీరు వచ్చి శ్రీశైలానికి చేరుతోంది.