SRPT: తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం ఐలమ్మ జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఆమె విగ్రహానికి, పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.