PLD: మాచర్ల మండలం నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జి సమీపంలో గడచిన రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి రహదారిపై పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరి రాళ్లు, మట్టి తొలగించి, ట్రాఫిక్ సాధ్యమయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు.