ఐక్యరాజ్య సమితి సమావేశాల నిమిత్తం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా వెళ్లారు. అయితే, ఐరోపా మీదుగా కాకుండా.. ఆయన విమానం చుట్టూ తిరిగి వెళ్లడం చర్చనీయాంశమైంది. అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసమే ఇలా చేసి ఉంటారని తెలుస్తోంది. కాగా, గాజాపై యుద్ధం నేపథ్యంలో ఆయనపై ఐసీసీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.