MBNR: బాలానగర్ మండలంలోని జాలుగడ్డ తండాకు చెందిన కేతావత్ రతన్, అంజనమ్మ దంపతుల కుమారుడు సురేష్ ఇటీవలే వెలువడిన నీట్ ఫలితాలలో 1,707 ర్యాంకు సాధించాడు. ఇటీవలే వెలువడిన కౌన్సిలింగ్లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో సీటు పొందాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఎంబీబీఎస్ సీటు సాధించడం పట్ల తండావాసులు, స్నేహితులు, బంధువులు అభినందించారు.