YSR Arogyashri : మే1 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్..
ఆరోగ్య శ్రీ (Arogyashri)సేవలకు బ్రేక్ పడనుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు నిరసన వ్యక్తం చేయనున్నారు. ఆరోగ్య శ్రీ సేవలకు దూరంగా ఉంటామని ప్రకటించారు.
ఏపీలో ఆరోగ్యశ్రీ (Arogyashri) సేవలకు బ్రేక్ వేయాలని ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం(Association of Hospitals) నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడమే దీనికి కారణమని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రులకు దాదాపు రూ.2 వేల కోట్లు ప్రభుత్వం బకాయిలు పడింది.ప్రైవేట్ ఆస్పత్రులకు బిల్లులు (Bills) రాకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల అసోషియేషన్ సమావేశమై ఈ తీర్మానం చేశారు.
మే 1 నుంచి అన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిచిపోనున్నాయి. ఈ తీర్మానాల ప్రతులను రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు ఆరోగ్యశ్రీ సీఈవో(Arogyasree CEO)కు పంపించారు. మరి ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చింస్తుందేమో చూడాలి. పాత బకాయిలకు సంబంధించి ఇదివరకు చాలాసార్లు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగాయి. పలు వాయిదాలు పెట్టినా కూడా ఇంతవరకు ఇచ్చిన మాటకు కట్టుబడి లేదంటున్నారు. ప్రభుత్వం విధించిన గడువు మరోసారి ముగియడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు అసోషియేషన్ (Association) ప్రకటించారు