MNCL: బతుకమ్మ, శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న వారు డీజేలకు దూరంగా ఉంటే మంచిదని జన్నారం ఎస్సై జి. అనుష సూచించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. డీజేలతో ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా వస్తాయన్నారు. గుండె సమస్యతో బాధపడే వారికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుందని ఇటీవల చాలామంది డీజేలతో మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. డీజేలకు దూరంగా ఉండాలని ఆమె కోరారు.