MDK: జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాన్ని అరికట్టేందుకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు 5 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 8.150 కిలోల గంజాయిని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ నిర్వీర్యం చేసినట్లు తెలిపారు.