CTR: బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం అమ్మవారిని అన్నపూర్ణ దేవి అలంకరణలో కొలువ తీర్చారు. ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట హోమ పూజలు ఏర్పాటు చేశారు. ఉభయదారుల నడుమ అమ్మవారికి వేద పండితులచే ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు.