E.G: దోసకాయలపల్లి-బూరుగుపూడి గేటు జంక్షన్ వద్ద గురువారం ఉదయం లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ బోల్తా పడటంతో లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.