KNR: కరోనా కారణంగా నిలిపివేసిన ముంబై(లోకమాన్య తిలక్ టర్మినస్)–కరీంనగర్ రైలు తిరిగి ప్రారంభమైందని కరీంనగర్ రైల్వేస్టేషన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ భాను చందర్ గురువారం తెలిపారు. ఇది వారానికి ఒక్కసారే మంగళవారం మధ్యాహ్నం 3:30కు ముంబై నుంచి బయలుదేరి, బుధవారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ చేరుతుంది. అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు తిరుగు ప్రయాణం కూడా జరుగుతుంది.