E.G: దేవరపల్లి మండలం త్యాగం పూడిలో జలజీవన్ స్కీం ద్వారా మంజూరైన రూ. 43 లక్షల నిధులతో 60 వేల లీటర్ల సామర్థ్యం గల కొత్త వాటర్ ట్యాంకు నిర్మాణానికి సర్పంచ్ స్వరూప రాణి శంకుస్థాపన చేశారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన పాత ట్యాంకు స్థానంలో దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఉప సర్పంచ్, ఎంపీటీసీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.