ప్రకాశం: జిల్లా కొత్తపట్నం మండలం ఆలూరు పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణలు ఆలూరు వద్ద ప్రతిపాదిత భూములను పరిశీలించి, పలు అంశాలపై చర్చించారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు.