SRD: నిజాంపేట్ మండలం బాచేపల్లి గ్రామంలో మండల స్పెషల్ ఆఫీసర్ అనిల్ కుమార్, ఎంపీడీవో సంగ్రామ్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పరిసరాలన్నీ పరిశుభ్రం చేశారు. గ్రామంలోని అంగన్వాడీ టీచర్లు, పొదుపు సంఘాల మహిళలు శ్రమదానం చేశారు. సెక్రటరీ రమేష్, సుదర్శన్, శ్రీకాంత్, శివ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.