సత్యసాయి: పరిగి మండల కేంద్రంలోని ఒకటవ రేషన్ దుకాణంలో గురువారం స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ నిర్వహించారు. మండల తహశీల్దార్ హసీనా సుల్తానా ఆధ్వర్యంలో రేషన్ లబ్ధిదారులుకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి, మండల అభివృద్ధి కమిటీ నాయకులు సూర్యనారాయణ, సోమప్ప, సంజీవరాయప్ప, తదితరులు పాల్గొన్నారు.