AP: పలువురు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చి మళ్లీ వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రారంభ సమయానికి సభలో 30 మంది ఎమ్మెల్యేలు ఉండటంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. దీంతో విప్‌లను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అప్రమత్తం చేశారు. సమావేశాలకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశారు.