SRCL: ఓట్లను చోరీ చేసి బీజేపీ ప్రభుత్వం నియంతల వ్యవహరిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి అన్నారు. కోనరావుపేటలో ఓటు చోరీపై గురువారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్లను చోరీ చేసి గెలవాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టేనని మండిపడ్డారు. ప్రజలు భవిష్యత్తులో బీజేపీకి బుద్ధి చెబుతారన్నారు.