BHPL: జిల్లాలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ 2, 3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి కొట్టుకుపోవడంతో పాటు, దాదాపు 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని గురువారం సింగరేణి అధికారులు తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది.