నాగర్ కర్నూలు: అచ్చంపేట నియోజకవర్గం చారకొండ మండలం సిరసనగండ్ల సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కాంక్షించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవనానికి భూమి పూజ చేశారు.