గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ ట్రేడ్ షోను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ట్రేడ్షోకు రష్యా భాగస్వామ్య దేశంగా ఉంది. ఈ సందర్బంగా మోదీ ప్రసంగిస్తూ మాస్కోపై ప్రశంసలు కురిపించారు. జీఎస్టీ సంస్కరణ సహా పలు అంశాలను ప్రస్తావించారు. ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించి స్వావలంబన దిశగా సాగిపోవాలన్నారు.