ఢిల్లీలో ఓ ప్రముఖ ఆశ్రమానికి చెందిన బాబాపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. స్వామి చైతన్యానంద సరస్వతిపై కాలేజీకి చెందిన 17 మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఐఏఎఫ్ అధికారి పంపించిన ఈ-మెయిల్‌తో బాబా అక్రమాలు బయటపడినట్లు సమాచారం.