HYDలో ఏర్పాటు చేసిన యూటర్న్లు ప్రాణాలు తీస్తున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో యూటర్న్ వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, కొందరు చనిపోతున్నారు, మరికొందరు గాయాలపాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే చర్యలు తీసుకుని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది.