కడప: సిద్ధవటం మండలం మాధవరం -1లోని శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగవ రోజు బుధవారం అర్చకులు జింకా సాంబయ్య అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించి, విశేష పూజలు చేశారు. పరిసర భక్తులు అమ్మవారు దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.