SRPT: జాజిరెడ్డిగూడెం మండలంలో 9 మంది లబ్ధిదారులకు గురువారం నాగారంలోని ఎమ్మార్సీ భవనంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా చెక్కులను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్లొంటున్నట్లు తహసీల్దార్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సకాలంలో హాజరై చెక్కులు పొందాలని కోరారు.