GNTR: పొన్నూరు మున్సిపల్ ఏరియా పరిధిలో కాలువలు, చెరువులు ఆక్రమించి నివాసం ఉంటున్న ఆక్రమణదారులు 15 రోజులలోపు ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు సూచించారు. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టం 1965 సెక్షన్ 361 (1) ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు కమిషనర్ రమేష్ బాబు బుధవారం ప్రకటన విడుదల చేశారు.