ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్, పవన్, ప్రభాస్ ఫ్యాన్స్.. తమ అభిమాన హీరోల వింటేజ్ సినిమాలను రీ రిలీజ్ చేసి పండగ చేసుకున్నారు. అయితే ఒకప్పటి హిట్ సినిమాలను మాత్రమే రీ రిలీజ్ చేసి.. సెలబ్రేషన్స్ చేసుకున్నారు అభిమానులు.
కానీ ఇంత త్వరగా పుష్ప మూవీని రీ రిలీజ్ చేయడం ఇప్పుడు విశేషంగా మారింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప మూవీ.. అన్ని భాషల్లోను దుమ్ముదులిపేసింది. ముఖ్యంగా హిందీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే తెలుగుతో పాటు మళయాళంలోను బన్నీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే అక్కడ పుష్ప మూవీని మరోసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
పుష్ప సినిమా విడుదలై.. ఏడాది పూర్తిచేసుకుంటున్న సందర్భంగా.. అదే తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు. మరో నెల రోజుల్లో ఈ సినిమా ఫస్ట్ యానివర్సరీ జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ సినిమాను కేరళలో మళ్లీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇ4 ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ.. డిసెంబర్ 17న కేరళలో ‘పుష్ప’ను రి-రిలీజ్ చేయబోతోంది. దాంతో మళయాళంలో బన్నీ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అలాగే ఒక సంత్సరానికే పుష్ప మూవీని రీ రిలీజ్ చేస్తున్నారంటే.. పుష్ప 2 కోసం ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సీక్వెల్‌ను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. త్వరలోనే బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘రేసు గుర్రం’ మూవీని కూడా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా మరోసారి బన్నీ హిట్ సినిమాలు సందడి చేయనున్నాయని చెప్పొచ్చు.