SRCL: ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోవాలని టీజీ రెడ్కో మేనేజర్ మునీందర్ రెడ్డి, అసిస్టెంట్ డెవలప్ మెంట్ ఆఫీసర్ లక్ష్మీకాంతరావులు పిలుపునిచ్చారు. చందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో సోలార్ విద్యుత్‌పై బుధవారం అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంను వినియోగించుకోవాలన్నారు.