»Ttd Teachers Mlc Shaik Sabji Cheating On Tirumala Darshan Tickets
Tirumala టికెట్లు అమ్ముకుంటున్న AP MLC షేక్ సాబ్జీ అరెస్ట్
వైఎస్ జగన్అ ధికారంలోకి వచ్చాక తిరుమలలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని భక్తులు ఆరోపిస్తున్నారు. దర్శనం టికెట్ల కేటాయింపులో అక్రమాలు , తిరుమలలో అపవిత్ర కార్యకలాపాలు వంటివి జరగడం వాటికి నిదర్శనంగా చెబుతున్నారు.
ఆయనో ప్రజాప్రతినిది. ఉపాధ్యాయులు (Teachers) ఎన్నుకుంటే చట్టసభలోకి అడుగు పెట్టిన వ్యక్తి. అలాంటి ప్రజాప్రతినిధి చిల్లర వ్యవహారానికి పాల్పడ్డాడు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను (Tirumala) తన మోసాలకు కేంద్రంగా మార్చుకున్నాడు. దర్శనం టికెట్లను అమ్ముకోవడం (Black Tickets) మొదలుపెట్టాడు. ప్రజాప్రతినిధి కావడంతో ఆయనకు కొన్ని కోటాలో తిరుమల దర్శనం టికెట్లు (Darshan Tickets) కేటాయిస్తుంది. ఆ టికెట్లను అడ్డదారుల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో తిరుమల తిరుపతి విజిలెన్స్ (Tirumala Tirupati Vigilence) అధికారులు అతడి డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (Teachers MLC) షేక్ సాబ్జీ (Shaik Sabji). ఆయన ఇటీవల తరచూ తిరుమలను దర్శించుకుంటున్నారు. పదే పదే ఆలయానికి వస్తుండడంతో టీటీడీ (Tirumala Tirupati Devasthanams- TTD) అధికారులు దృష్టి సారించారు. విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా ఎమ్మెల్సీ మోసాలు బయటపడ్డాయి. ఫోర్జరీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలోనే ఆరుగురి దర్శనం కోసం రూ.లక్ష 5 వేలు భక్తుల నుంచి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాకు భక్తులు తరలించారు. నెల రోజుల వ్యవధిలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఏకంగా 19 సిఫార్సు లేఖలు జారీ చేశారు. ప్రతి సిఫార్సు లేఖను ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకే ఇచ్చినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భక్తుల ఫిర్యాదుతో ఎమ్మెల్సీపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సాబ్జీ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. కాగా వైఎస్ జగన్ (YS Jagan) అధికారంలోకి వచ్చాక తిరుమలలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని భక్తులు ఆరోపిస్తున్నారు. దర్శనం టికెట్ల కేటాయింపులో అక్రమాలు , తిరుమలలో అపవిత్ర కార్యకలాపాలు వంటివి జరగడం వాటికి నిదర్శనంగా చెబుతున్నారు.