‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’తో వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న మాస్ మహారాజా ‘రావణసుర’ తీవ్ర నిరాశపర్చింది. అయినా గెలుపోటములకు దూరంగా ఉండి తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు రవితేజ. రవితేజ (Ravi Teja) ఇటీవల ఓ కొత్త కారును కొనుగోలు చేశాడు. ఆ కారుకు ఫ్యాన్సీ నంబర్ (Fancy Number)ను సొంతం చేసుకునేందుకు వేలంలో (Auction) పాల్గొన్నారు. దీనికోసం రవాణా శాఖ కార్యాలయానికి (Road Transport Office) రావడంతో సందడి వాతావరణం ఏర్పడింది. ఇంతకీ రవితేజ ఏ కారు కొన్నాడు? ఫ్యాన్సీ నంబర్ ఏంటి? ఎంత ధర? అనే వివరాలు తెలుసుకోండి.
సాధారణ కారు కాకుండా రవితేజ ఈసారి విద్యుత్ కారును (Electric Car) కొనుగోలు చేశాడు. బీవైడీ అట్టో 3 (BYD Atto 3) అనే కారును కొన్నాడు. దాని ఖరీదు దాదాపు రూ.34.5 లక్షలు ఉంటుంది. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన తెలంగాణలోని ఆర్టీఓ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. హైదరాబాద్ (Hyderabad) ఖైరతాబాద్ (Khairatabad)లోని కార్యాలయానికి రవితేజ రావడంతో అక్కడి అధికారులు దగ్గరుండి ప్రత్యేక శ్రద్ధతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను (Registration) పూర్తి చేశారు. ఈ వాహనానికి టీఎస్ 09 జీబీ 2628 అనే ఫ్యాన్సీ నంబర్ దక్కింది. ఈ నంబర్ ను వేలంలో రూ.17,628 కు రవితేజ దక్కించుకున్నాడు.
రవితేజ కొనుగోలు చేసిన కారు ప్రత్యేకతలు ఆసక్తికరంగా ఉన్నాయి. చైనాకు చెందిన బైవీడీ అట్టో కారు అత్యంత సురక్షితమైంది. 5 స్టార్ రేటింగ్ ఉంది. 12.8 ఇంచుల సెంట్రల్ స్క్రీన్ ఉంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. పనోరమిక్ సన్ రూఫ్, పవర్డ్ టెయిల్ గేట్, వైర్ లెస్ ఫోన్ చార్జర్, సింథటిక్ లెదర్ అపోల్ ట్ర్సే, పవర్డ్ ఫ్రంట్ డ్రైవర్, 5 ఇంచుల డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లసర్ తదితర ప్రత్యేకతలు ఈ కారు సొంతం. రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. కాగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా కొత్త కొన్న విషయం తెలిసిందే. కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్టీఏ కార్యాలయానికి వచ్చి సందడి చేశారు.