స్టార్ డైరెక్టర్ శంకర్ అంటేనే.. భారీ చిత్రాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా శంకర్ సినిమా పాటలకు అయ్యే ఖర్చుతో.. మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయొచ్చు. కేవలం పాటల కోసమే కొన్ని కోట్లు ఖర్చు చేస్తుంటాడు శంకర్.
ఇప్పుడు ఆర్సీ 15 సాంగ్స్‌ను అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడట శంకర్. అందుకోసం కోట్లు కోట్లే ఖర్చు చేస్తున్నట్టు టాక్. తాజాగా RC 15 ఓ సాంగ్ బడ్జెట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఓ పాటకు, ఫైట్‌కు పది కోట్లకు అటు ఇటుగా ఖర్చు చేసినట్టు వార్తలు రాగా.. ఇప్పుడు మరో పాటను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారట. రామ్ చరణ్ మరియు హీరోయిన్ కియారా అద్వానీలపై నవంబర్ 20 నుండి న్యూజిలాండ్‌లో ఓ పాటను చిత్రికరించబోతున్నారట శంకర్.
కేవలం ఈ ఒక్క పాట కోమే 15 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదే అత్యంత కాస్ట్లీ సాంగ్‌గా రికార్డు క్రియేట్ చేయడం పక్కా అని చెప్పొచ్చు. అది కూడా 12 రోజులు షూట్ చేయనున్న పాటకు 15 కోట్లంటే.. రోజుకి కోటి పాతిక లక్షలు ఖర్చు చేయనున్నారని చెప్పొచ్చు.
ఈ లెక్కన ఆ పాట ఏ రేంజ్లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలోనే ఈ సాంగ్ హైలెట్‌గా ఉంటుందని అంటున్నారు. అయితే శంకర్ సినిమా కాబట్టి.. ఈ బడ్జెట్లో పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ నిర్మాత దిల్ రాజు కూడా ఇంత మొత్తంలో ఖర్చు చేస్తుండడంతో.. ఆర్సీ 15 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. అలాగే దిల్ రాజు లెక్క తప్పుతోందా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినా ఆర్సీ 15 నెక్ట్స్ లెవల్ అనేలా ఉంటుందంటున్నారు.