ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా.. అయితే మధ్యలో దీంతో పాటు ఇండియన్ 2ని తిరిగి పట్టాలెక్కించాడు శంకర్. అందుకే ఆర్సీ 15 లేట్ అవుతుందనే మెగా ఫ్యాన్స్ మండి పడుతున్నారు. అయితే ఇప్పటికే రెండు భారీ ప్రాజెక్ట్స్‌తో ఒకేసారి రిస్క్ చేస్తున్న శంకర్.. అప్పుడే కొత్త ప్రాజెక్ట్‌కు రంగం సిద్దం చేస్తున్నాడట. గతంలో బాలీవుడ్లో అపరిచితుడు సినిమాని రణవీర్ సింగ్‌తో రీమేక్ చేయడానికి కమిట్ అయ్యాడు శంకర్. కానీ రీమేక్ బదులు రణ్వీర్తో కొత్త ప్రాజెక్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.
తమిళ్లో వేల్పరి అనే నవల ఆధారంగా బిగ్గెస్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా మల్టీ స్టారర్‌గా రాబోతోందని తెలుస్తోంది. మామూలుగానే శంకర్ సినిమాలంటే భారీ బడ్జెట్‌తో ఉంటాయి. ఇక మల్టీ స్టారర్ అంటే.. ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ఈ సినిమాకు ఏకంగా వెయ్యి కోట్ల ఖర్చు చేయబోతున్నట్లుగా చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇక ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో రణవీర్ సింగ్‌తో పాటు సూర్య, యష్ నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఇందులో నటించే ఛాన్స్ ఉందనే రూమర్స్ ఊపందుకున్నాయి. శంకర్ ప్రస్తుతం ఆర్సీ 15 చేస్తున్నాడు కాబట్టి.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌లోను చరణ్‌కి ఛాన్స్ ఉందంటున్నారు. అదే జరిగితే ఈ ప్రాజెక్ట్ మరింత ఇంట్రెస్టింగ్గా మారనుంది చెప్పొచ్చు. కానీ ముందు ఆర్సీ 15 రిలీజ్ అవ్వాలి.. అది బ్లాక్ బస్టర్ అవ్వాలి.. ఆ తర్వాతే మరోసారి శంకర్-చరణ్ కాంబినేషన్ ఉంటుందని అంటున్నారు.