దిల్ రాజు నిర్మాణంలో.. స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్సీ 15 ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి నుంచి ఈ సినిమాకు లీకులు వెంటాడుతూనే వున్నాయి. ఇప్పటికే ఈ మూవీ కీలక షెడ్యూల్స్‌ని రాజమండ్రి పరిసర ప్రాంతాలతో పాటు.. అమృత్ సర్‌లో జెట్ స్పీడ్‌లో పూర్తి చేశారు. ఆ సమయంలో చరణ్‌కు సంబంధిచిన కొన్ని స్టిల్స్, వీడియోలు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ తరువాత కూడా పలు ఫొటోలు లీక్ కావడంతో.. లీగల్‌గా యాక్షన్ తీసుకుంటామని మీడియా ప్రకటన చేసింది చిత్ర యూనిట్. అయినా ఆర్సీ 15కు షాక్ ఇస్తునే ఉన్నాయి లీకులు.
తాజాగా ఈ సినిమా నుంచి ఆడియో సాంగ్ లీక్ అయింది. అది కూడా సాంగ్ షూట్ కోసం ఏర్పాటు చేసిన సెట్‌తో పాటు సాంగ్ ఆడియో కూడా లీక్ అవడంతో.. ప్రస్తుతం ఆ ట్యూన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ పాట విన్న తర్వాత మెగా ఫ్యాన్స్ అంచనాలు భారీగా పెంచేసుకుంటునే.. మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా లీకులపై జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ముఖ్యంగా ప్రొడక్షన్ టీమ్ ఏం చేస్తోందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయితే అప్పటికే చిత్ర యూనిట్ రంగంలోకి దిగినప్పటికీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. ఇక ఈ ప్రాజెక్ట్ లేటెస్ట్ షెడ్యూల్లో.. దర్శకుడు మరియు నటుడు ఎస్ జె సూర్య జాయిన్ అయ్యారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఏదేమైనా ఆర్సీ 15 లీకులు మాత్రం ఆగడం లేదు.