BDK: రైతులందరికీ సరిపడా యూరియా వెంటనే సరఫరా చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మార్కెటియార్డ్లో యూరియా సరఫరా కేంద్రం వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రభుత్వ వెంటనే స్పందించాలని, జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.