NLR: జిల్లాలోని బి.వి నగర్లో నివసిస్తున్న స్వరూప అనే మహిళ,తన తమ్ముడు వంశీ మానసిక స్థితి సరిగా లేక, తాను చనిపోతున్నానని, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఫోన్ పెట్టేయడంతో వెంటనే 112కు సోమవారం సమాచారం అందించారు. కోవూరు CI వి.సుధాకర రెడ్డి వెంటనే స్పందించి, వంశీ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి, రామన్నపాలెం రైల్వే ట్రాక్ వద్ద ఉన్నట్ల గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు