కేంద్ర ప్రభుత్వం (central government) 2017లో నేషనల్ స్టీల్ పాలసీని (national steel policy 2017) తీసుకు వస్తున్నట్లు ప్రకటన చేసిందని, దీని ప్రకారం భారత్ లో 2030 నాటికి భారత స్టీల్ ఉత్పత్తిని (india steel production) ప్రస్తుతం ఉన్న 122 మిలియన్ టన్నుల నుండి 300 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు (cbi jd lakshminarayana). విశాఖపట్నంలో కేఏ పాల్ తో (ka paul) కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంటు (visakha steel plant) లో ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని, దేశంలోని మిగతా ప్రభుత్వ, ప్రయివేటు కంపెనీల ఉత్పత్తి కలుపుకుంటే మొత్తం 122 మిలియన్ టన్నులుగా ఉందన్నారు. మరో 178 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, 2030 నాటికి 300కు పెంచాలని చూస్తోందన్నారు. ఇందుకోసం సెయిల్ లేదా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో ముందుకు వస్తోందన్నారు. అన్ని కంపెనీలకు సాయం చేస్తున్నారన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేయాలన్నారు.
ఓ వైపు ఆ కొడుకుకు మంచి భోజనం పెట్టి చూస్తున్నారని, ఈ పిల్లాడిని అమ్మేయాలని చూడటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంటును సెయిల్ ఆధ్వర్యంలోనే ఉంచవచ్చునని లేదా కేంద్రం తెలంగాణ లేదా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల చేతికి ఇవ్వాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంటులో ఉత్పత్తిని 7.3 మిలియన్ టన్నుల నుండి 20 మిలియన్ టన్నులకు పెంచుకోవచ్చునని, అప్పుడు ఆర్ కార్డు హోల్డర్లు కలిగిన వారిలో 7634 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వవచ్చునని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పైన సవతి తల్లి ప్రేమ వద్దన్నారు. స్టీల్ ప్లాంటు కోసం పోరాడుతున్న వారందరిని మనతో కలుపుకొని పోవాలని, ఇందులో భాగంగానే కేఏ పాల్ తో కలిసి వెళ్తున్నామని చెప్పారు. పాల్ కు కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయని, కాబట్టి ప్రయివేటీకరణను ఆపే ప్రయత్నంలో ఆయనను కూడా కలుపుకొని వెళ్తున్నట్లు చెప్పారు.