KRNL: నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కీలక ఘట్టానికి సర్వం సిద్ధం చేశామని కమిషనర్ విశ్వనాథ్ శుక్రవారం తెలిపారు. ప్రకృతి ప్రేమికులకు ఉచితంగా 6 వేల మొక్కలు అందిస్తున్నామని, పచ్చ సుంకేసుల , పెల్టోఫోరమ్, గుల్మోహర్, ఎర్ర సుంకేసుల, కొండ తంగేడు, గంగరావి, సీతాఫలం, తపస్సి, కానుగ, జామ, వేప వంటి 9 రకాల మొక్కలను అందజేస్తామన్నారు.