MBNR: జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి సమీపంలో ఉన్న ఎంవీఎస్ కాలేజ్ బస్ స్టాప్ వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు తెలిపారు. బస్ స్టాప్ ముందు చెట్లు విపరీతంగా పెరగడం, స్టాప్ ముందు అనేక బైక్లు పార్క్ చేసి ఉండడం వల్ల విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇంకా పరిష్కారం కాలేదని వాపోతున్నారు.