ముంబై (Mumbai) తర్వాత రెండు రోజులకే దేశ రాజధాని ఢిల్లీలో రెండో యాపిల్ రిటైల్ స్టోర్ (Apple's retail store) ను సంస్థ లాంచ్ చేయనుంది. ఢిల్లీ సాకెట్లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటలకు యాపిల్ రిటైల్ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెక్ దిగ్గజం ఇప్పటికే వెల్లడించింది.
దేశ ఆర్థిక రాజధానిముంబై (Mumbai)లోని ఓ రెస్టారెంట్లో టిమ్‌కుక్(Timcook)తో కలిసి తను వడా పావ్ తింటున్న ఫొటోను మాధురి దీక్షిత్ ట్విట్టర్లో షేర్ చేశారు. వడా పావ్‌తో అతిథికి ఆహ్వానం పలకడంకంటే మెరుగైనది ఇంకోటి ఉండదు అంటూ ఆమె ట్వీట్ చేసింది. దేశంలోని తొలి యాపిల్ స్టోర్ మంగళవారం ముంబైలో ప్రారంభం కానుంది. ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి స్వయంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ హాజరవుతారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న టిమ్ కుక్కు మాధురీ దీక్షిత్ (Madhuri Dixit) సోమవారం వడా పావ్ రుచిని పరిచయం చేశారు. బిర్యానీకి హైదరాబాద్ (Hyderabad) ఎంతో ప్రసిద్ధి చెందిందో వడా పావ్‌కు ముంబై అంత ఫేమస్ అన్న విషయం తెలిసిందే. ఇక మాధురి ట్వీట్‌కు టిమ్ కుక్ కూడా తన దైన శైలిలో రిప్లై ఇచ్చారు. వడా పావ్ రుచిని పరిచయం చేసిన మాధురికి నా ధన్యవాదాలు.
ఈ వంటకం రుచి చూడటం ఇదే తొలిసారి. అద్భుతంగా ఉంది అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో.. ఈ ట్వీట్ల థ్రెడ్ వైరల్‌గా మారింది. కుక్కు ముంబై లోకల్ ట్రైన్ల(Local trains)ను కూడా పరిచయం చేయాలని మరికొందరు సూచించారు. దేశంలోనే తొలి అధికారిక ‘యాపిల్’ రిటైల్ స్టోర్ (Apple’s retail store) ఓపెనింగ్ కు రెడీ అయింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (Bandra Kurla Complex) లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్ లో రేపు ఉదయం రిటైల్ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ముంబై స్టోర్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.స్టోర్ మొత్తం చాలా రిచ్ గా కనిపిస్తోంది. ముంబైలోని యాపిల్ రిటైల్ స్టోర్ ను 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. లాస్ఎంజెల్స్(Los Angeles), న్యూయార్క్, బీజింగ్, మిలాన్, సింగ్‌పూర్ వంటి నగరాల తర్వాత ముంబైలోనే యాపిల్ ఐ-ఫోన్ రిటైల్ స్టోర్ ఏర్పాటు కానుంది.