A rare baby : కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో24 వేళ్లతో శిశువు జననం
కోరుట్ల (Korutla) ప్రభుత్వ ఆస్పత్రిలో వింత ఘటన చోటుచేసుకుంది. (Nizamabad) లోని ఎర్గట్లకు చెందిన రవళి అనే మహిళ ఇవాళ తెల్లవారుజామున మగబిడ్డకు జన్మనివ్వగా.. శిశువు చేతులు, కాళ్లకు మొత్తం కలిపి 24 వేళ్లు (24 fingers) ఉన్నాయి ఇలా ఆరు వేళ్లతో జన్మించిన పిల్లలు పుట్టడం అత్యంత అరుదుగా జరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలా ఆరు వేళ్లతో పుట్టిన శిశువును చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపిస్తున్నారు.
జగిత్యాల జిల్లా (Jagityala District) కోరుట్లలో ఓ శిశువు 24 వేళ్లతో జన్మించాడు. కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో శిశువు చేతులు, కాళ్లకు ఆరు వేళ్లతో జన్మించాడు. నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలం (Kammaripalli Mandal) ఏరుగట్లకు చెందిన రవళి అనే మహిళకు పురిటినొప్పులు రావటంతో ప్రభుత్వాసుపత్రి(Government Hospital)కి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్య సిబ్బంది ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు. అయితే పసికందుకు రెండు కాళ్లు, రెండు చేతులకు కూడా ఆరువేళ్లు ఉండటాన్ని వైద్యులు గమనించారు. ప్రతి చేయి కాలుకు ఆరు వేళ్ల చొప్పున మెుత్తం 24 వేళ్లతో శిశువు (baby)జన్మించాడు. ఇలా ఆరు వేళ్లతో జన్మించిన పిల్లలు పుట్టడం అత్యంత అరుదుగా జరుగుతుందని డాక్టర్లు(Doctors) అంటున్నారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
ఇలా ఆరు వేళ్లతో పుట్టిన శిశువును చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపిస్తున్నారు. మానవుడికి రెండు కాళ్లు, రెండు చేతులు ఉంటాయి. అలా కాకుండా ఏదైనా ఎక్కువైనా.. తక్కువైనా అది విచిత్రమే అవుతుంది. అదనపు శరీరభాగాలతో పుట్టడం అరుదుగానే జరుగుతుంది. ఇలాంటి జననాల్లో అదనపు వేళ్లతో పుట్టేవారు ఎక్కువగా ఉంటారు. అయితే ఈ పిల్లల్లో ఒక చేతికి లేదా కాలుకి ఎక్కువ వేళ్ళతో పుడతారు. చాలా మందికి చేతికి 6 వేళ్లు ఉండటాన్ని మనం గమనిస్తాం. జన్యు పరంగా ఎక్కడో ఓ చోట అలా శిశువులు జన్మిస్తారు. అలాంటిది ఓ శిశువు 24 వేళ్ల(24 fingers)తో పుట్టాడు. అత్యంత అరుదుగా మాత్రమే ఇలా పుడతారని వైద్యులు చెబుతున్నారు