ప్రకాశం: మార్కాపురం YCP కార్యాలయంలో బుధవారం ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు ‘చలో మెడికల్’ కాలేజీ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈనెల 19న మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అన్నారాంబాబు తెలిపారు. ప్రజలు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.