తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఇటీవల హరీశ్ చేసిన కామెంట్స్‌పై ఏపీ మంత్రులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రుల కామెంట్స్ తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని పవన్ అంటున్నారు.
Pawan kalyan:తెలంగాణ అభివృద్ధి గురించి ఇటీవల మంత్రి హరీశ్ రావు (Harish rao) చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. భవన నిర్మాణ కార్మికులతో.. మీరు ఏపీ వెళ్లి ఉండరు కదా.. అక్కడేం డెవపల్ లేదు.. ఇక్కడే ఓటు తీసుకోవాలని కోరారు. ఆ వ్యాఖ్యలను ఏపీ మంత్రులు (ministers) కారుమూరి నాగేశ్వరరావు (karumuri nageshwara rao), సిదిరి అప్పలరాజు (sidiri appalraju), బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) కౌంటర్ ఇచ్చారు. హరీశ్ రావుకు (harish rao) పార్టీ నుంచి మద్దతుగా నిలిచారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) కూడా అండగా నిలిచారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలను ఖండించారు. ఈ మేరకు వీడియో ట్వీట్ చేశారు.
వైసీపీ నేతల కామెంట్స్ ఇబ్బందికరంగా ఉన్నాయని పవన్ కల్యాణ్ (pawan kalyan) అన్నారు. హరీశ్ రావు కాక.. తెలంగాణ ప్రజలను (telangana people) కించపరిచేలా ఉన్నాయని విమర్శించారు. జనసేన (janasena) పార్టీ తొలి నుంచి పాలకులు వేరు, ప్రజలు వేరు అని చెబుతుందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఏపీ నేతలకు (ap leaders) తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు (business), ఇళ్లు (home) ఉన్నాయని గుర్తుచేశారు.మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) గతంలో తెలంగాణ రాష్ట్రంలో కేబుల్ వ్యాపారం (cable business) చేశారని తెలిపారు.
నేతలు మాట్లాడిన అంశాలకు ప్రజలను భాగస్వామ్యులను చేయొద్దని సూచించారు. ఇదే తమ విధానం అని స్పష్టంచేశారు. వైసీపీ నేతలు తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్ (pawan kalyan) కామెంట్స్ కాస్త ఆశ్చర్యం కలిగించాయి. పవన్ (pawan) కామెంట్స్ వెనక నిజంగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం ఉందా..? లేదంటే మరో 7,8 నెలల్లో ఇక్కడ ఎన్నికలు ఉన్నాయని అంటున్నారా అని పొలిటికల్ ఆనలిస్టుల (political analyst) మాట. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన తర్వాతే.. ఏపీలో జరగనున్నాయి. ఏపీలో జగన్ సర్కార్‌ను దించేయాలని పవన్ అంటున్నారు. ఇప్పటికే టీడీపీతో లోపాయికారి ఒప్పందం కూడా జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలతో కూడా టచ్‌లో ఉంటున్నారు. శత్రువు శత్రువు మిత్రువు అన్నట్టు.. వైసీపీని (ycp) టార్గెట్ చేశారని మరికొందరు అంటున్నారు. ఏమైతేనేం గానీ పవన్ కామెంట్స్ మాత్రం పొలిటికల్ సర్కిళ్లలో కొత్త చర్చకు దారితీశాయి.