»Girl With Indian Flag Painted On Face Denied Entry Into Golden Temple
Girl మొహంపై జాతీయ పతాకం.. గోల్డెన్ టెంపుల్‌లోకి నో ఎంట్రీ
మొహంపై జాతీయ పతాకం పెయింటింగ్ వేసుకున్న బాలికను స్వర్ణ దేవాలయంలోకి అనుమతించలేదు. దానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ప్రబంధక్ కమిటీ క్షమాపణ చెప్పింది.
Girl with Indian flag painted on face denied entry into Golden Temple
Girl with Indian flag paint on face:ఓ బాలిక (girl) మొహంపై జాతీయ జెండా పెయింటింగ్ వేసుకొని.. స్వర్ణ దేవాలయంలోకి (golden temple) వెళ్లాలని అనుకుంది. అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను నిలిపివేశారు. ఇదీ ఇండియా (india) కాదు.. పంజాబ్ (punjab), ఇక్కడికి ఇలా రావొద్దు అని చెప్పారు. ఆ వీడియో సోషల్ మీడియాలో (social media) షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. ఇంకేముంది శిరోమని గురుద్వారా ప్రబంధక్ కమిటీ స్పందిచింది.
అట్టారి-వాఘా సరిహద్దు వద్ద బీటింగ్ రీట్రిట్ సెర్మనీకి చాలా మంది ఇలా మొహంపై జాతీయ జెండా (national flag) పెయింటింగ్ వేసుకొని హాజరవుతారు. ఆ తర్వాత పంజాబ్‌లో (punjab) ఉన్న స్వర్ణ దేవాలయానికి (golden temple) వస్తారు. ఆ బాలిక కూడా అలానే వచ్చారు. ఆలయం వద్ద ఉన్న స్టాఫ్ అడ్డుకున్నారు. మొహం మీద పెయింటింగ్ ఉండొద్దని స్పష్టం చేశారు.
బాలికను (girl) అడ్డుకోవడంతో ఆమె తరఫు వారు వాదానికి దిగిన ఆడియో (audio) కూడా స్పష్టంగా వినిపిస్తోంది. ఇదీ పంజాబ్.. ఇండియా కాదని అనడంతో వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇలా తమను అవమానించడం సరికాదని అంటున్నారు. వీడియో సోషల్ మీడియాలో (social media) చక్కర్లు కొడుతుంది. దీంతో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ జనరల్ సెక్రటరీ గురుచరణ్ సింగ్ గ్రెవాల్ (Gurcharan Singh Grewal) స్పందించారు.
ఆలయం (temple) వద్ద ఏదైనా తప్పు జరిగితే క్షమించాలని కోరారు. ‘ప్రతీ ఒక్కరు.. తమ ఆలయంలో ఆచారం, సాంప్రదాయం ఉంటాయని చెప్పారు. అలాగే స్వర్ణ దేవాలయలోకి అందరినీ ఆహ్వానిస్తున్నాం. కానీ ఆ బాలిక మొహంపై జాతీయ జెండా లేదు. ఏదో ఒక రాజకీయ పార్టీ రంగు ఉంది. మొహం మీద ఉన్న పెయింటింగ్‌లో అశోక చక్రం లేదు. అయినప్పటికీ తమ తరఫున తప్పు జరిగితే క్షమించండి అని’ గురుచరణ్ సింగ్ (Gurcharan Singh Grewal) సారీ చెప్పారు.