»Increased Security At Up Cm Yogis Residence Section 144 In All Districts
Atiq Ahmed: సీఎం యోగి నివాసానికి భద్రత పెంపు.. యూపీలో అన్ని జిల్లాల్లో 144 సెక్షన్
అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ల హత్యతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేగింది. అల్లర్లు ఏర్పడే ప్రమాదం ఉన్నట్టు భావించిన అధికారులు అన్ని జిల్లాల్లో సెక్షన్ 144 విధించారు. సున్నితమైన ప్రాంతాలకు పెట్రోలింగ్లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం నివాసానికి భద్రత పెంచారు.
Atiq Ahmed: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్(Atiq Ahmed) హత్య దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కస్టడీలో ఉండగానే ముగ్గురు దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్(Point Blank Range) నుంచే వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు అక్కడే చనిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(cm yogi) ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తునకు సంబంధించి కమిటీ వేయాలని అధికారులకు సూచించారు. ముగ్గురు సభ్యులతో కూడిన జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదేశించారు.
గ్యాంగ్ స్టర్ల హత్య జరగగానే యూపీ అంతా కలకలం రేగింది. దీంతో యూపీలోని అన్ని జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్(144 section) విధించారు. పోలీసులంతా అలర్ట్ గా ఉన్నారు. అన్ని జిల్లాల్లో పోలీసులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ లో అల్లర్లను ఎదుర్కొనేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ప్రయాగ్ రాజ్ లో పోలీసులు హైఅలర్ట్ విధించారు. పీఏసీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. అటు సీఎం యోగి అదిత్యానాథ్ నివాసానికి భారీ భద్రత(cm yogi residence)ను పెంచారు. ఈ మర్డర్ అనంతరం కనీసం 17మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.