ఉత్తరప్రదేశ్‌కు ఆరున్నరేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నానని, 2017 నుంచి రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు జరగలేదని సీఎం యోగి అన్నారు. గత 6 సంవత్సరాలలో కర్ఫ్యూ లేదు, అల్లర్లు లేవు. ప్రజలందరూ అన్ని పండుగలు ప్రశాంతంగా జరుపుకున్నారు.
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్‌లో నేరస్థులు, మాఫియాలపై బుల్డోజర్ చర్యపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం యోగి.. ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా లాక్కున్న వ్యక్తులకు నేను హారతి ఇవ్వాలా.. ? నేరగాళ్లు, మాఫియాలపై చర్యలు తీసుకోవాలని యూపీ ప్రజలు కోరుతున్నారు.
దీంతో పాటు ఉత్తరప్రదేశ్‌కు ఆరున్నరేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నానని, 2017 నుంచి రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు జరగలేదని సీఎం యోగి అన్నారు. గత 6 సంవత్సరాలలో కర్ఫ్యూ లేదు, అల్లర్లు లేవు. ప్రజలందరూ అన్ని పండుగలు ప్రశాంతంగా జరుపుకున్నారు. కుట్రలను, అల్లర్లను అసలు సమర్థించేదే లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, సమర్థులైతే గెలుస్తారన్నారు. కుదిరితే గెలుస్తాం, కుదరకపోతే ఓడిపోతాం. వ్యక్తి ప్రత్యర్థిగా ఉండి, గెలవగల సామర్థ్యం కలిగి ఉంటే, అతను గెలవాలి. ఇది ప్రజాస్వామ్య హక్కు. అతడి గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. దీనిపై ఎవరూ మాట్లాడరు..అందరూ మౌనంగా ఉన్నారంటూ మండిపడ్డారు.
మణిపూర్ అంశంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. మణిపూర్‌లో మళ్లీ శాంతి నెలకొంటుందని, అక్కడి బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న అభివృద్ధి ప్రక్రియ వేగంగా పురోగమిస్తుంది. అంతే కాకుండా జ్ఞాన వాపి విషయంపై ఆయన మాట్లాడుతూ మసీదు అని పిలిస్తే వివాదాలు వస్తాయని, జ్ఞానవాపి అని పిలవాలని కోరారు. మసీదు లోపల ‘త్రిశూల్’ ఉంది ? మేమేం కావాలని దానిని అక్కడ ఉంచలేదు.. అక్కడ లోపల భద్రతకు సెంట్రల్ ఫోర్స్ ఉంది, ‘జ్యోతిర్లింగం’ ఉంది, దేవతా విగ్రహాలు ఉన్నాయి. చరిత్రను వక్రీకరించవచ్చు, కానీ గోడలపై ఉన్న చారిత్రక ఆధారాలను చెరపలేరన్నారు. చారిత్రక తప్పిదం జరిగిందని, దానికి పరిష్కారం వెతకాలని ముస్లిం వైపు నుంచి కూడా ప్రతిపాదన రావాలని భావిస్తున్నానని చెప్పారు.