»Uttar Pradesh Mafia Turned Politician Atiq Ahmed And His Brother Ashraf Ahmed Shot Dead In Prayagraj
Atiq Ahmed:గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్ ను కాల్చి చంపిన దుండగులు
గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్(Atiq Ahmed) దారుణ హత్యకు గురయ్యాడు. జైలు(Jail) నుంచి వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు అతీఖ్ అహ్మద్‌ని ప్రయాగ్‌రాజ్ తీసుకెళ్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు.
Atiq Ahmed:యూపీలో సంచలనం సృష్టించిన ఉమేశ్‌పాల్(umeshpal) హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్(Atiq Ahmed) దారుణ హత్యకు గురయ్యాడు. జైలు(Jail) నుంచి వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు అతీఖ్ అహ్మద్‌ని ప్రయాగ్‌రాజ్ తీసుకెళ్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో అతీఖ్ సోదరుడు అష్రాఫ్ అహ్మద్(Ashraf Ahmed) కూడా ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల జీప్ దిగి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుండగానే అతీఖ్ సోదరులను దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్(Point Blank Range)లో కాల్చి చంపారు. మీడియా కెమెరా(Media Camera)ల సాక్షిగా సోదరులిద్దరూ కాల్పుల్లో మృతిచెందారు. కాల్పులు జరిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రెండ్రోజుల క్రితమే అతీఖ్ అహ్మద్ కొడుకును యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎన్కౌంటర్ చేసింది. కిడ్నాప్‌లు, హత్యలు, బలవంతపు వసూళ్లు సహా అనేక నేరాలకు అతీఖ్ గ్యాంగ్ పాల్పడింది.
4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అతీఖ్(Atiq) గెలిచాడు. అతీఖ్ భయంకర గ్యాంగ్ స్టర్. అతని పై ఉన్న కేసుల్లో దర్యాప్తు చేయాలంటేనే పోలీసులే భయపడేవారు. అతీఖ్ కేసుల విచారణ నుంచి గతంలో 12 మంది న్యాయమూర్తులు(Lawyers) తప్పుకున్నారు. యూపీలో యోగి(CM Yogi) సర్కార్ ఏర్పడ్డ తర్వాత నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎలాంటి నేరగాళ్లను ఊపేక్షించేది లేదని పలు సందర్భాల్లో సీఎం యోగి చెపుతుండేవారు. ఈ క్రమంలో వరుసగా వందల మంది నేరగాళ్లు ఎన్కౌంటర్ చేయబడ్డారు. తాజాగా అతీఖ్ కుమారుడు అసద్ అహ్మద్, అతని స్నేహితుడు గులాంను యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.