GDWL: జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి ఆలయం ముందు అండర్ పాస్ నిర్మించాలని కోరుతూ బీచుపల్లి, కొండపేట గ్రామస్తులు సోమవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుకి వినతిపత్రం అందజేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. అండర్ పాస్ లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. రోడ్డుపై వెళ్లడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు.