PDPL: తెలంగాణ విద్యుత్ డిప్లొమో ఇంజినీర్ల సంఘం (TPDEA) ఉపాధ్యక్షుడిగా పెద్దపల్లి ADE/SPM అడిచర్ల శ్రీనివాస్ నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హనుమకొండలో జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో ఈ ఘనత సాధించారు. సహచర ఉద్యోగులు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు.