HNK: ఐనవోలు మండల కేంద్రంలో శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయంలో100 ఏండ్ల చరిత్ర కలిగిన శివాలమర్రి చెట్టు వర్షాల కారణంగా చెట్టు వేర్లు బయటపడడంతో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ నెపథ్యంలో సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అధికారులు, పర్యావరణ నిపుణులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ సహకారంతో శతాబ్దాల వృక్ష సంపదను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.