RR: షాద్ నగర్ ప్రజల ఆరోగ్య రక్షణ లక్ష్యంగా ఉమ్మడి మండలానికి ఒక్కోటి చొప్పున అదనంగా నాలుగు అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. కేశంపేట, ఫరూఖ్ నగర్, కొందుర్గు, కొత్తూరు మండలాలకు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యారంగానికి, వైద్య రంగానికి ముఖ్యమంత్రి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.